దారుణం : దళిత బాలికపై ఎనిమిది మంది అత్యాచారం

Dalit girl gang-raped by 8 in Jalandhar. పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. జలంధర్‌లో ఓ మైనర్ ద‌ళిత‌‌ బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By Medi Samrat  Published on  4 April 2021 7:03 AM GMT
Gang rape  in Punjab

పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. జలంధర్‌లో ఓ మైనర్ ద‌ళిత‌‌ బాలికపై 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై ఆమె బాయ్ ఫ్రెండ్‌ తన స్నేహితులతో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలంధర్‌లో దళిత కుటుంబానికి చెందిన బాలిక కొన్నేళ్లుగా సందీప్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఆమెను పెళ్లిచేసుకుంటానని సందీప్‌ మాట ఇవ్వడంతో.. అతడిని నమ్మింది. గత నెల 15న ఫోన్‌ చేసి.. మరుసటిరోజు హర్యానాలోని సిర్సా జిల్లాలోని మండి దాబ్‌వలి బస్టాప్‌లో కలుద్దామని చెప్పాడు. ఆ తర్వాత జలంధర్ కు వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.

సందీప్‌ మాట న‌మ్మిన సదరు బాలిక..‌ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పంజాబ్‌లోని కిలియన్‌ వాలీ అనే ప్రదేశానికి వెళ్లింది. అక్కడికి సందీప్ ను క‌లుసుకుని ఇద్దరు కలిసి జలంధర్‌కు వెళ్లారు. అక్క‌డ ఓ గదికి బాలిక‌ను తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న తన స్నేహితులతో కలిసి బాలిక‌పై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ త‌ర్వాత‌ నాలుగు రోజులకు అంటే.. మార్చి 20న బాలిక ఇంటి బయట పడేసి వెళ్లిపోయారు. బాలిక‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ద‌ర్యాప్తు చేస్తున్నారు. దారుణానికి ఒడిగ‌ట్టిన‌ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.


Next Story
Share it