సెల్ఫీ మోజు.. ప్రేమ జంట ప్రాణం తీసింది
Lovers slip into water flow while taking a selfie.సెల్ఫీ మోజులో పడి ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు.
By తోట వంశీ కుమార్ Published on 14 April 2021 11:10 AM ISTసెల్ఫీ మోజులో పడి ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికి ఇప్పటికి కూడా యువతలో మార్పు రావడం లేదు. రిస్క్ అని తెలిసి కూడా ప్రమాదకర ప్రదేశాల్లో సెల్పీలు తీసుకుంటూ మృత్యువాత పడుతున్నారు. సెల్పీలు తీసుకునే సమయంలో తాము ఎక్కడున్నామో.. చుట్టు ప్రక్కల ఏం జరుగుతుందనేది కూడా పట్టించుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట వంతెన పై నుంచి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. జారీ నదిలో పడిపోయారు. వారికి ఈత రాకపోడంతో మరణించారు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బీదర్‌లోని ఓ కాలేజీలో పురుషోత్తం పాటిల్ అనే విద్యార్థి బీఏ చదువుతున్నాడు. అతడి ప్రియురాలు గుల్బర్గాలో ఇంజినీరింగ్ చదువుతోంది. ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. సోమవారం ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర్ గణేశ గుడి సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. చూడగానే ఆ ప్రదేశం వారికి నచ్చంది. అక్కడ సెల్పీ దిగాలని బావించారు. సెల్పీ దిగేందుకు యత్నించగా జారీ వంతెన పై నుంచి నదిలో పడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. దీంతో నదిలో వారు కొట్టుకుపోయారు. ఇద్దరికి ఈత రాకపోవడంతో ప్రాణలు కోల్పోయారు.
వంతెన పైన దొరికిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువతి కుటుంబ సభ్యులకు కొందరు సమాచారం అందించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకుని చూడగా.. అక్కడ ఎలాంటి ఆధారాలు వారికి లభించలేవు. రక్షిత కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నదిలో రెండు మృతదేహాలు పైకి తేలడంతో.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. వీరు ప్రమాద వశాత్తు పడిపోయారా..? లేక ఆత్మహత్య చేసుకున్నారా..? అన్న కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.