సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలో శవాలై తేలిన ప్రేమజంట

సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన జంట ప్రేమకథ విషాదంగా ముగిసింది.

By అంజి  Published on  7 Jun 2024 7:21 AM IST
Lovers found dead, Manjeera river, Sangareddy, Crime

సంగారెడ్డిలో విషాదం.. మంజీరా నదిలో శవాలై తేలిన ప్రేమజంట

సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన జంట ప్రేమకథ విషాదంగా ముగిసింది. జూన్‌ 2న ఇంటి నుంచి అదృశ్యమైన ఆ జంట గురువారం న్యాల్‌కల్‌ మండలంలో నదిలో శవమై కనిపించారు. హద్దనూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్‌కల్‌ మండలం కాకి జనవాడ గ్రామానికి చెందిన బేగరి సదానందం (26) తన సమీప బంధువైన ఉమ (22) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఉమ నారాయణఖేడ్ మండలం చాప్టా-కె గ్రామానికి చెందినది.

వీరి పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన సదానందం, ఉమ జూన్ 2న బైక్‌పై ఇళ్ల నుంచి బయలుదేరారు. వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు బుధవారం హద్దనూరు పోలీసులను ఆశ్రయించారు. న్యాల్‌కల్‌ మండలం పులకుర్తి వద్ద మంజీర వంతెనపై బైక్‌, దంపతుల పాదరక్షలను పోలీసులు గుర్తించారు. పోలీసులు గురువారం సాయంత్రం మృతదేహాలను వెలికితీశారు.

Next Story