విషాదం.. సూర్యాపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
Lovers committed suicide in Suryapet district.సూర్యాపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం
By తోట వంశీ కుమార్ Published on
26 Feb 2021 6:37 AM GMT

సూర్యాపేట జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులోకి దూకి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న ప్రేమ జంట అదృశ్యమవగా ఇరు కుటుంబాల సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ జంట కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం చెరువులో మృతదేహాలు పైకి తేలి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులోంచి బయటకు తీయించారు. మృతులను లక్ష్మీపురంకు చెందిన మణికంఠ(19), ఫాతిమా (17)గా గుర్తించారు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు చేసుకున్నట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story