యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో విషాదం.. రైలు కింద ప‌డి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

Love couple commit suicide at Yadadri Bhuvana Giri District.యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 2:01 PM IST
యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో విషాదం.. రైలు కింద ప‌డి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య‌

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద ప‌డి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకుంది. బాహుపేట స‌మీపంలో బుధ‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బుధ‌వారం ఉద‌యం రైలు ప‌ట్టాల‌పై మృత‌దేహాలు ప‌డి ఉండ‌టాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను భువ‌న‌గిరి మండ‌లం బ‌స్వాపూర్ గ్రామానికి చెందిన గ‌ణేష్‌(25), అదే గ్రామానికి చెందిన న‌లంద‌(23)గా గుర్తించారు.

కాగా.. న‌లంద‌కు మూడేళ్ల క్రిత‌మే యాద‌గిరి ప‌ట్ట‌ణానికి చెందిన ఓ వ్య‌క్తితో వివాహం జ‌రిగింది. అత‌డు యాద‌గిరి గుట్ట దేవ‌స్థానంలోని ల‌డ్డూ త‌యారీ విభాగంలో ప‌నిచేస్తుంటాడు. మంగ‌ళ‌వారం రాత్రి అత‌డు విధులు ముగించుకుని ఇంటికి వ‌చ్చి చూసే స‌రికి భార్య లేదు. దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

రైల్వే పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు యాద‌గిరి గుట్ట పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప్రాథ‌మిక విచార‌ణ చేప‌ట్టారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున 2.30గంట‌ల ప్రాంతంలో ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా.. పెళ్లి కాక‌ముందే న‌లంద‌కు గ‌ణేశ్‌తో ప్రేమ వ్య‌వ‌హారం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story