కారు, లారీ ఢీ.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

Lorry hits car in Siddipet District three dead.సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కారును లారీ ఢీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2022 12:54 PM IST
కారు, లారీ ఢీ.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. చిన్న‌ కోడూరు మండ‌లం మ‌ల్లారం స్టేజీ వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు క‌రీంన‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్ వెలుతుండ‌గా.. మ‌ల్లారం స్టేజీ వ‌ద్ద రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారు డ్రైవ‌ర్‌తో పాటు దంప‌తులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ ప్ర‌మాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

Next Story