బొలేరోను ఢీకొట్టిన బొగ్గు టిప్పర్.. ముగ్గురు కూలీలు దుర్మరణం
Lorry collide with Minivan in Bhadradri Kothagudem.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on
28 Jan 2022 6:36 AM GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చండ్రుగొండ మండలం సుజాతనగర్‌కు చెందిన కూలీలు అన్నపరెడ్డిపల్లె మండలంలో వరినారు తీసేందుకు బొలేరో వాహనంలో బయలుదేరారు. వీరు ప్రయాణీస్తున్న వాహనం తిప్పనపల్లి వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీ కొట్టింది. అప్పటి కూడా ఆగని లారీ కొంత దూరం వెళ్లి అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో స్వాతి(27), సుజాత(40) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story