అనంత‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. 5గురు దుర్మ‌ర‌ణం

Lorry Collide with Auto in Anantapur five people dead.కూలీల‌తో వెలుతున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 3:18 AM GMT
అనంత‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. 5గురు దుర్మ‌ర‌ణం

కూలీల‌తో వెలుతున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణీస్తున్న ఐదుగురు కూలీలు అక్క‌డిక్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. శుక్ర‌వారం ఉద‌యం పామిడి శివారులోని జాతీయ‌ర‌హ‌దారిపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. లారీ ఢీ కొన‌డంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. మృత‌దేహాలు రోడ్డుపై చెల్లాచెద‌రుగా ప‌డిపోయాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల‌ను గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి‍‌(40) గా గుర్తించారు. ఈ ప్ర‌మాదం లారీ డ్రైవ‌ర్ అజాగ్ర‌త్త కార‌ణంగానే జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు..

ఇదే జిల్లాలో మ‌రో ప్ర‌మాదం..

పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద పాదాచారుల‌ను కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో యాకోబ్‌(62), నారాయణ(60) మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఈ రోజు జ‌రిగిన‌ వేర్వేరు రోడ్డు ప్ర‌మాదంలో మొత్తం ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది.

Next Story
Share it