Nandyal: విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వ్యక్తిని కట్టేసి కొట్టిన స్థానికులు

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి పట్టుబడ్డాడు.

By అంజి  Published on  2 Sept 2024 4:30 PM IST
Locals beat man, schoolgirl , Nandyal , Crime

Nandyal: విద్యార్థినిపై అత్యాచారయత్నం.. వ్యక్తిని కట్టేసి కొట్టిన స్థానికులు 

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించి పట్టుబడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాశీపురంకు చెందిన బాలిక.. కోవెలకుంట్ల పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతోంది. అదే గ్రామానికి చెందిన దాసయ్య కూడా బాలిక చదువుతున్న స్కూల్‌ వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఆదివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై దాసయ్య అత్యాచారానికి ప్రయత్నించాడు. అతడిని ప్రతిఘటించిన బాలిక గట్టిగా కేకలు వేసింది. ఇది విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు దాసయ్యను పట్టుకుని తాళ్లతో కట్టివేసారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు నిందితుడిని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై అవుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story