ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది నేరచరిత్ర.. మందలించారని తల్లిదండ్రుల హత్య!

హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీనగర్‌లో ఆదివారం నాడు ప్రేమోన్మాది దాడి ఘటన సంచలనం రేపింది. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు.

By అంజి  Published on  4 Sept 2023 10:00 AM IST
LB Nagar, Accused Sivakumar, Criminal History, Crime news

ఎల్బీనగర్‌ ప్రేమోన్మాది నేరచరిత్ర.. మందలించారని తల్లిదండ్రుల హత్య!

హైదరాబాద్‌ నగరంలోని ఎల్బీనగర్‌లో ఆదివారం నాడు ప్రేమోన్మాది దాడి ఘటన సంచలనం రేపింది. ఈ దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రేమను నిరాకరించిందని ప్రియురాలి తమ్ముడిని నిందితుడు శివకుమార్‌ చంపాడు. నిందితుడిని రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్‌గా పోలీసులు గుర్తించారు. శివకుమార్‌కు గతంలో కూడా నేరచరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడి గురించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రేమ వ్యవహారంలోనే మందలించినందుకు సొంత తల్లిదండ్రులని దారుణంగా హత్య చేశాడని సమాచారం.

మూడేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తితో కొట్టి హతమార్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తండ్రి హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రేమ వ్యవహారంపైనా నిందితుడు ఇంట్లో గతంలో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం తండ్రి గట్టిగా మందలించాడంతో ఆగ్రహంతో ఊగిపోతూ శివకుమార్‌ తన తండ్రిని హత్య చేశాడు. చిన్న వయసులో చేసిన తప్పునకు భవిష్యత్తు పాడవుతుందన్న ఉద్దేశంతో గ్రామపెద్దలు విషయం బయటకు పొక్కనివ్వలేదని సమాచారం. నిందితుడు శివకుమార్ నేర చర్రితపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Next Story