మ‌ర‌ణం త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

Law student commits suicide by writing letter to mother.మ‌ర‌ణం త‌రువాత జీవితం ఉందా..? మ‌ర‌ణిస్తే ఏం జ‌రుగుతుంది అని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 9:00 AM IST
మ‌ర‌ణం త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

మ‌ర‌ణం త‌రువాత జీవితం ఉందా..? మ‌ర‌ణిస్తే ఏం జ‌రుగుతుంది అని చాలా మందిలో మెదిలే ప్ర‌శ్న‌. అయితే.. మ‌ర‌ణం త‌రువాత జీవితం ఉంటుందని కొంద‌రు చెబుతుండ‌గా అది త‌ప్ప‌ని మ‌రికొంద‌రు వాదిస్తుంటారు. ఏదీ నిజం అనేది తెలియ‌దు. ఈ విష‌యాన్ని తెలుసుకోవాల‌ని అనుకున్నాడు ఓ న్యాయ విద్యార్థి. ఇంకేమీ ఆలోచించ‌కుండా ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆ త‌ల్లికి తీర‌ని క‌డుపుకోత మిగిల్చాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లాకు చెందిన స‌ల్మాన్‌(19) చెన్నైలోని త‌ర‌మ‌ణిలో ఉన్న లా కాలేజీలో రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. స్థానికంగా ఓ ప్రైవేటు వ‌స‌తిగృహంలో ఉంటున్నాడు. అయితే.. కొద్ది రోజుల క్రితం తిరునెల్వేలికి వెళ్లి వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి స్నేహితుల‌తో కూడా స‌రిగ్గా మాట్లాడ‌డం లేదు. తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో త‌న గ‌దిలో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌రలించారు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు స‌ల్మాన్ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో.. మ‌ర‌ణం త‌రువాత ఏం జ‌రుగుతుంది..? అని తెలుసుకునేందుకు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నా. నేను దాచుకున్న రూ.5వేలను అమ్మ‌కు ఇవ్వండి అని రాసి ఉంది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆత్మ‌హ‌త్య‌కు ఇంకా వేరే ఏదైనా కార‌ణం ఉందా..? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story