తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతాన్నాడని.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు.!

Law student attacks classmate with knife on campus arrested. తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతన్నాడని లా స్టూడెంట్‌ కోపంతో రగిలిపోయాడు. ఆ తర్వాత కత్తితో తన తోటి విద్యార్థిని పొడిచి హత్యాయత్నం చేశాడు.

By అంజి  Published on  2 Aug 2022 2:33 PM IST
తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతాన్నాడని.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు.!

తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతన్నాడని లా స్టూడెంట్‌ కోపంతో రగిలిపోయాడు. ఆ తర్వాత కత్తితో తన తోటి విద్యార్థిని పొడిచి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నలో కలకలం రేపింది. యూనివర్సిటీ ఆఫ్‌ లక్నోలో ఈ ఘటన జరిగింది. లా స్టూడెంట్‌ అయిన నిందితుడు సుదాన్షు తన క్లాస్‌మేట్‌ అమ్మాయితో మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి విద్యార్థిని సుధాన్షును దూరం పెట్టి.. చంద్రభూషన్‌ అనే మరో విద్యార్థితో స్నేహంగా ఉంటోంది. ఇది చూసిన సుదాన్షు జీర్ణించుకోలేకపోయాడు.

చంద్ర‌భూష‌ణ్‌తో త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ చ‌నువుగా ఉండ‌టాన్ని సీరియస్‌గా తీసుకొని.. సుధాన్షు క్లాస్‌రూంలోనే అత‌డిపై క‌త్తితో దాడి చేశాడు. క‌త్తిపోట్ల‌తో తీవ్రంగా గాయ‌ప‌డిన చంద్ర‌భూష‌ణ్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ట్ర‌యాంగిల్ ల‌వ్ వ్య‌వ‌హారమే క‌త్తిపోట్ల‌కు దారితీసింద‌ని పోలీసులు భావిస్తున్నారు.

''మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 2019-2024 బ్యాచ్‌కు చెందిన బీఏ. ఎల్‌ఎల్‌బీ విద్యార్థి సుధాన్షు, క్లాస్ ముగిసిన వెంటనే అమిటీ లా స్కూల్‌లోని క్లాస్‌రూమ్ నంబర్ 406లో అదే బ్యాచ్‌కి చెందిన చంద్రభూషణ్ భరద్వాజ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు'' అని యూనివర్సిటీ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన పలువురు విద్యార్థులు భయంతో క్యాంపస్ వదిలి వెళ్లిపోయారు.

భరద్వాజ్‌ మెడకు, తలకు గాయాలయ్యాయని, యూనివర్సిటీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించామని యూనివర్సిటీ తెలిపింది. పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

''విద్యార్థులిద్దరూ డే స్కాలర్స్, వారణాసి, మొఘల్‌సరాయ్ ప్రాంతాలకు చెందినవారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు'' అని యూనివర్సిటీ ప్రకటనలో పేర్కొంది. అయితే వీరిద్దరి మధ్య పాత శత్రుత్వం ఉందని, సోమవారం నాటి ఘటన కూడా అదే కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నిందితుడిని అరెస్టు చేశామని, బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీసీపీ ప్రాచీ సింగ్ తెలిపారు.

Next Story