మైనర్ బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో ఉండడాన్ని చూసిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత

Landlord started blackmailing minor caught talking to BF. మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్న ఓ ఇంటి యజమానిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి తన బాయ్‌ఫ్రెండ్‌

By M.S.R  Published on  3 March 2022 5:36 PM IST
మైనర్ బాలిక తన బాయ్ ఫ్రెండ్‌తో ఉండడాన్ని చూసిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత

మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్న ఓ ఇంటి యజమానిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా చూసిన వ్యక్తి నీ తండ్రికి చెబుతానని చెప్పి బెదిరించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు విషయం తెలుసుకున్నారు.

లక్నోలోని గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న బాధితురాలు ఒకరోజు తన ప్రియుడితో మాట్లాడుతోంది. ఈ సమయంలో, ఆ ఇంటి యజమాని అతుల్ తివారీ బాధితురాలిని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను బాధితురాలి ఇంట్లో చెబుతానని బెదిరించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఆమెను లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలిని నిరంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బ్లాక్‌మెయిల్‌తో విసిగిపోయిన బాధితురాలు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలియడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు అతుల్ తివారీ యూనిజా హెల్త్ కేర్ మెడికల్ కంపెనీలో జోనల్ మేనేజర్‌గా ఉన్నాడు. బాధితురాలి ఇంటి యజమాని. మైనర్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు పంపారు.

Next Story