మోస‌పోయాను.. న్యాయం చేయండి

Lady Constable Honey Trap. ఆమెకు హైదరాబాద్ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో మంచి ఉద్యోగం.. అయితే ఒంటరిగా ఉన్న యువకులే టార్గెట్

By Medi Samrat  Published on  18 May 2021 11:07 AM GMT
conistable

ఆమెకు హైదరాబాద్ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో మంచి ఉద్యోగం.. అయితే ఆ ఉద్యోగంతో వచ్చే జీతంతో ఆమె సంతృప్తి చెందలేదు. పెళ్లి కూడా చేసుకుంది.. అయితే ఆ పెళ్లి కూడా పెటాకులు అయ్యింది. మొత్తం ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు విడాకులు ఇవ్వగా.. ఒకరు ఈమె వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. తాజాగా ఈ కిలేడి వ్యవహారం బయటకు వచ్చింది.. సంధ్యా రాణి టార్గెట్ ముఖ్యంగా డబ్బులు ఉన్న వాళ్లే..! కొత్తగా హైదరాబాద్ కు వచ్చిన వాళ్లతో కూడా ఆమె పరిచయాలు పెంచుకునేది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ నమ్మించేది.. డబ్బులు దోచుకోవడమే పనిగా పెట్టుకుంది. ఎవరికైనా ఆమె తీరు మీద అనుమానం వచ్చి అడిగితే పోలీసు డిపార్ట్మెంట్ పేరు చెప్పి బెదిరించడం మొదలు పెట్టేది.

షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజ ను ట్రాప్ చేసింది సంధ్యారాణి. ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన చరణ్ తేజ్ ను ప్రేమలోని లాగింది. గత వివాహాలు విషయం తెలియకుండా చరణ్ ను నమ్మబలికించి పెళ్లి చేసుకుంది సంధ్య. అతడికి ఆమె అసలు విషయం తెలిసి దూరం పెట్టడానికి ప్రయత్నించగా పోలీసు కేసు పెడతాను అంటూ బెదిరించడం మొదలు పెట్టింది. పెళ్లి చేసుకోక పోతే ST SC అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించింది. అంతేకాకుండా కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయటపెడ్తానాన్ని బెదిరింపులకు గురి చేసింది. సంధ్య నుండి నన్ను రక్షించండి అంటూ శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించాడు బాధితుడు.

ఒంటరిగా ఉన్న యువకులను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుందని పిర్యాదు లో పేర్కొన్నారు. సంధ్య రాణి భాదితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుకున్నాడు. గతంలో సంధ్య వరస పెళ్లిళ్ల పై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆమె తల్లిదండ్రులే పిర్యాదు చేశారట. ఇష్టం వచ్చిన వారితో తిరుగుతుంది అన్ని తల్లితండ్రులు పిర్యాదులో పేర్కొన్నారు. ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని బాధితులతో గడుపుతోందని తెలుస్తోంది. సంధ్య రాణి ని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భాదితుడు డిమాండ్ చేస్తున్నాడు.


Next Story