కోవిడ్ పరీక్ష కోసం ఒక మహిళ యొక్క ప్రైవేట్ భాగాల నుండి శాంపిల్స్ సేకరించినందుకు ల్యాబ్ టెక్నీషియన్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. నిందితుడికి మహారాష్ట్రలోని అమరావతి జిల్లా కోర్టు శిక్ష విధించింది. నిందితుడిపై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయి. యువతి ఫిర్యాదు మేరకు ల్యాబ్ టెక్నీషియన్‌ను పోలీసులు జూలై 30, 2020న అరెస్టు చేశారు. ఆ మహిళ అమరావతిలోని ఓ షాపింగ్ మాల్‌లో ఉద్యోగి. మాల్‌లోని ఒక ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఇతరులు కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారు, ఇతరులు పరీక్ష కోసం బద్నేరాలోని ట్రామాకేర్ సెంటర్‌కు వెళ్లారు.
పరీక్ష తర్వాత, ల్యాబ్ టెక్నీషియన్ మహిళకు మళ్లీ కాల్ చేసి, పరీక్ష ఫలితం పాజిటివ్‌గా ఉందని ఆమెకు తెలియజేశాడు. తదుపరి పరీక్షల కోసం ఆమెను ల్యాబ్‌కు రమ్మని కూడా చెప్పాడు. ఆమె ల్యాబ్‌కు చేరుకున్నప్పుడు, ల్యాబ్ టెక్నీషియన్ మహిళ యొక్క ప్రైవేట్ భాగాల నుండి శాంపిల్స్‌ను సేకరించాలన్నాడు. ఘటన అనంతరం ఇంటికి వచ్చిన మహిళకు అనుమానం వచ్చి తన సోదరుడికి విషయం చెప్పింది. వైద్యుడితో మాట్లాడగా.. పరీక్షల కోసం ప్రైవేట్ పార్ట్స్ నుంచి స్వాబ్స్ సేకరించడం లేదని తేలింది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 17 నెలల తర్వాత ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.