కర్నూలులో దారుణం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రయివేట్ లాడ్జిలో ప్రియురాలిని చంపి ఆ తర్వాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 16 Dec 2023 2:24 PM ISTకర్నూలులో దారుణం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య
కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ప్రయివేట్ లాడ్జిలో ప్రియురాలిని చంపి ఆ తర్వాత ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఈ ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
నందికొట్కూరులోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయ్ కుమార్, రుక్సాన మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరూ శుక్రవారం కర్నూలుకి వచ్చారు. అక్కడే ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. శనివారం ఉదయం వరకు వీరు గది నుంచి బయటకు రాలేదు. నీళ్లు.. భోజనాల కోసం కూడా బయటకు రాకపోవడంతో ఏం జరిగిందో అని లాడ్జ్ సిబ్బంది ఆందోళన చెందారు. డోర్ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు తలుపు తట్టినా స్పందన లేదు. చివరకు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు.
గదిలో ఇద్దరూ రక్తపు మడుగులో మంచంపై పడి ఉండటాన్ని చూసి లాడ్జి సిబ్బంది షాక్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు అక్కడ గదిని పూర్తిగా పరిశీలించారు. రుక్సానాపై కత్తిపోట్లను గమనించారు. విజయ్‌కుమార్ ఆమె పక్కనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటన స్థలిలో పరిస్థితులను చూస్తే ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు విజయ్‌కుమార్ కర్నూలులోని ఓ ప్రయివేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. రుక్సానా, విజయ్ కుమార్ మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.