సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 7 నెలల బాబు కిడ్నాప్‌.. పోలీసుల గాలింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడు నెలల బాబు కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాబు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

By అంజి  Published on  7 July 2023 10:09 AM IST
Kidnap, Secunderabad railway station, Crime news

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 7 నెలల బాబు కిడ్నాప్‌.. పోలీసుల గాలింపు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడు నెలల బాబు కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి బాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బృందాలతో కూడిన పోలీసులు తమిళనాడుకు వెళ్లి బాబు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన అజయ్‌, పింకీ దేవీ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ నెల 2వ తేదీన స్వస్థలం వెళ్లేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 5వ తేదీన ఉదయం 3 గంటలకు డీడీ ఉపాధ్యాయ జంక్షన్‌ వెళ్లే రైలు ఉండటంతో వారు రైల్వేస్టేషన్‌లోని పార్కింగ్‌ ప్రాంతంలోనే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే 4వ తేదీ సాయంత్రం అజయ్‌, పింకీ పీకల దాకా మద్యం సేవించారు. పీకలదాకా మద్యం సేవించిన అనంతరం అజయ్‌ తన భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైనా భర్త అజయ్ మద్యం మత్తులో ఇస్నాపూర్ వెళ్తున్న అని బ్యాగ్‌తో అక్కడి నుండి బయలుదేరాడు. అజయ్‌ని అడ్డుకునేందుకు భార్య పింకీ తన పిల్లలను అక్కడే వదిలి వెళ్లింది. తిరిగివచ్చి చూసే సరికి 7 నెలల బాబు కన్నయ్య మిస్సయ్యాడు. కన్నయ్యను ఓ మహిళ తీసుకెళ్లినట్లు అనుమానం.. వెంటనే తల్లి పోలీసులకు సమాచారాన్ని అందించింది పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా చేసుకుని బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మహిళ బాబును ఎత్తుకుని రైలులో చెన్నైకి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story