మ‌ద్యం మ‌త్తులో యువ‌తి.. బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే

Kerala woman molested by bike taxi driver.బైక్ ట్యాక్సీ డ్రైవ‌ర్, అత‌డి స్నేహితుడు కేర‌ళ కు చెందిన ఓ మ‌హిళ‌పై సామూహిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 10:11 AM IST
మ‌ద్యం మ‌త్తులో యువ‌తి.. బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే

బైక్ ట్యాక్సీ డ్రైవ‌ర్, అత‌డి స్నేహితుడు కేర‌ళ కు చెందిన ఓ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.

కేరళకు చెందిన మహిళ(22) గ‌త శుక్రవారం(నవంబ‌ర్ 25) అర్ధరాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. ఆ స‌మ‌యంలో ఆ మ‌హిళ మ‌ద్యం మ‌త్తులో ఉంది. డ్రైవ‌ర్ ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. అయితే.. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఆ మ‌హిళ దిగ‌లేక‌పోయింది. దీంతో ఆమెను త‌న ఇంటికి తీసుకువెళ్లాడు. త‌న‌ స్నేహితుడిని పిలిచాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ అత‌డి స్నేహితురాలు కూడా ఉంది. ఆమె ముందే ఇద్ద‌రు క‌లిసి కేర‌ళ మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

అనంత‌రం బాధితురాలిని ఆమె గ‌మ్య‌స్థానంలో వ‌దిలివేశారు. మ‌ద్యం మ‌త్తు నుంచి తేరుకున్న బాధితురాలు త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని గుర్తించింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు మంగ‌ళ‌వారం తెలిపారు.

Next Story