భర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన మహిళా పోలీసు అధికారి

కేరళలోని కన్నూర్ జిల్లాలో గురువారం సాయంత్రం మహిళా పోలీసు అధికారిని ఆమె భర్త అతి కిరాతకంగా తగలబెట్టి మరీ చంపేశాడు.

By Kalasani Durgapraveen  Published on  22 Nov 2024 1:30 PM IST
భర్త చేతిలో దారుణ హ‌త్య‌కు గురైన మహిళా పోలీసు అధికారి

కేరళలోని కన్నూర్ జిల్లాలో గురువారం సాయంత్రం మహిళా పోలీసు అధికారిని ఆమె భర్త అతి కిరాతకంగా తగలబెట్టి మరీ చంపేశాడు. మృతురాలిని దివ్యశ్రీగా గుర్తించారు. కాసర్‌గోడ్ జిల్లా చందేరా పోలీస్ స్టేషన్‌లో సివిల్ పోలీస్ ఆఫీసర్ (సీపీఓ)గా పని చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా దివ్యశ్రీ ఆమె భర్త రాజేష్ తో విడిపోయి తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5.45 గంటల సమయంలో రాజేష్ ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేశాడు. అలాగే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దివ్యశ్రీపై రాజేష్ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దివ్యశ్రీ తండ్రి వాసుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దివ్యశ్రీ, వాసు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా, దివ్యశ్రీ మృతి చెందింది. పరియారం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వాసు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజేష్‌ను కన్నూర్ పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పయ్యనూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రాజేష్‌ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story