52 ఏళ్ల కీచ‌క టీచ‌ర్‌.. 26 మంది విద్యార్థినుల‌పై లైంగిక దాడి..!

Kerala Teacher Arrested For Molesting 26 Students.విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించి వారిని స‌రైన మార్గంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jan 2023 3:50 AM GMT
52 ఏళ్ల కీచ‌క టీచ‌ర్‌.. 26 మంది విద్యార్థినుల‌పై లైంగిక దాడి..!

విద్యార్థుల‌కు విద్యాబుద్దులు నేర్పించి వారిని స‌రైన మార్గంలో న‌డిపించాల్సిన బాధ్య‌త గురువులదే. అలాంటిది ఓ గురువు దారి త‌ప్పాడు. అభం, శుభం తెలియ‌ని మైన‌ర్ బాలిక‌ల‌ను లైంగికంగా వేధించాడు. ఇటీవ‌ల పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు నిర్వ‌హించిన‌ కౌన్సెలింగ్ సెష‌న్‌లో ఓ విద్యార్థిని ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. అత‌డిపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా.. మొత్తం 26 మంది విద్యార్థినుల‌ను వేధిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ దారుణ ఘ‌ట‌న కేర‌ళ రాష్ట్రంలో జ‌రిగింది.

నవంబర్ 2021 నుండి 26 మంది విద్యార్థినుల‌ను వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై క‌న్నూర్ జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 52 ఏళ్ల ఉపాధ్యాయుడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా చైల్డ్‌లైన్ అధికారుల ఫిర్యాదుల ఆధారంగా సీనియర్ ఉపాధ్యాయుడిని జనవరి 12న లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని వివిధ నిబంధనల కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాఠశాలలో జరుగుతున్న కౌన్సెలింగ్‌లో ఈ ఘటన బయటపడింది. ఓ విద్యార్థిని త‌న‌కు ఎదురైన అనుభవాలను కౌన్సెలర్‌కు వివరించగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి కౌన్సెలింగ్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థినులు ఫిర్యాదులు చేశారని అధికారి తెలిపారు.

పోలీసులు మాట్లాడుతూ.. జ‌న‌వ‌రి 12న ఐదు కేసులు న‌మోదు చేశాం. శ‌నివారం మ‌రో 21 కేసులు న‌మోదు చేశాం. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి త‌ర‌లించాం. అని చెప్పారు. క‌రోనా మహమ్మారి తర్వాత పాఠశాల తిరిగి తెరిచిన త‌రువాత నుంచి ఈ దారుణాల‌కు అత‌డు పాల్ప‌డిన‌ట్లు విద్యార్థులు తెలిపారు.

Next Story