విద్యార్థినిపై డీన్‌ అత్యాచారం.. కేసు నమోదు

Kerala Police files rape case against dean of School of Drama in Thrissur. త్రిసూర్‌లోని స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ ఎస్ సునీల్‌కుమార్‌.. మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్

By అంజి  Published on  1 March 2022 7:48 AM GMT
విద్యార్థినిపై డీన్‌ అత్యాచారం.. కేసు నమోదు

త్రిసూర్‌లోని స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్ ఎస్ సునీల్‌కుమార్‌.. మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన దాదాపు మూడు నెలల తర్వాత, పోలీసులు చివరకు అతనిపై కేసు నమోదు చేశారు. కాలికట్ యూనివర్శిటీ కూడా సునీల్‌ కుమార్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నందున సస్పెండ్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థిని తన నివాసంలో ఉన్నప్పుడు సునీల్‌కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సునీల్‌కుమార్ తన భాగస్వామితో కలిసి తన ఇంటిలో ఉంటున్నాడని, ఆ అమ్మాయి కోసం రూమ్‌ కేటాయించాడని సమాచారం.

అయితే అతని భాగస్వామి లేనప్పుడు.. నవంబర్ 21, 2021న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతను లైంగిక స్వభావంతో కూడిన సందేశాల ఫోన్‌లో పంపేవాడని విద్యార్థిని ఆరోపించింది. డీన్ కూడా విద్యార్థిని మానసికంగా సరిగా లేదని చెబుతూ తోటివారి నుండి ఆమెను వేరు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. లైంగిక దాడి తర్వాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాడని, ఆమె ఎవరికైనా నిజాలు చెబితే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. తాగి వచ్చిన తర్వాత ఆమెకు ఫోన్ చేసేవాడని తెలిసింది. సునీల్‌కుమార్‌పై ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్లు త్రిసూర్ వెస్ట్ పోలీసులు తెలిపారు.

సునీల్‌కుమార్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 24 నుండి అరనాట్టుకర క్యాంపస్‌లో విద్యార్థులు నిరసన చేస్తున్నారు. కాగా, సునీల్‌కుమార్ పరారీలో ఉన్నాడు. కొంతకాలంగా లైంగిక వేధింపుల ఘటనతో బాధపడిన బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఆమె ఇప్పుడు తన చేతిపై కొట్టినందుకు కాలికట్ యూనివర్సిటీకి చెందిన విజిటింగ్ ఫ్యాకల్టీ రాజా వారియర్‌పై ఫిర్యాదు చేసింది. ఎందుకు కొట్టావు అని ఆమె అడిగితే.. పంచేంద్రియాలు, స్పర్శ సెన్సేషన్ నేర్పిస్తున్నానని చెప్పాడని తెలిసింది. కాగా అతనిపై కూడా పోలీసు కేసు నమోదైంది.

Next Story