దారుణం.. ఐదుగురిని చంపేసిన 23 ఏళ్ల యువకుడు.. తల్లిని, ప్రియురాలిని కూడా..

కేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు 23 ఏళ్ల యువకుడు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి తన తల్లి, టీనేజర్ సోదరుడు, స్నేహితురాలు సహా ఆరుగురిని చంపినట్లు చెప్పాడు.

By అంజి  Published on  25 Feb 2025 7:09 AM IST
Kerala , police, Crime, Thiruvananthapuram

దారుణం.. ఐదుగురిని చంపేసిన 23 ఏళ్ల యువకుడు.. తల్లిని, ప్రియురాలిని కూడా..

కేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు 23 ఏళ్ల యువకుడు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి తన తల్లి, టీనేజర్ సోదరుడు, స్నేహితురాలు సహా ఆరుగురిని చంపినట్లు చెప్పడంతో.. భయంకరమైన సామూహిక హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పటివరకు ఐదు మరణాలను నిర్ధారించారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ప్రదేశాలలో ఈ హత్యలు జరిగాయి. నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని వివరించిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది.

నిందితుడి 13 ఏళ్ల సోదరుడు అహసన్, అమ్మమ్మ సల్మా బీవీ, మామ లతీఫ్, అత్త షాహిహా, అతని స్నేహితురాలు ఫర్షానాలను అతడు హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అఫాన్ తల్లి పరిస్థితి విషమంగా ఉంది. తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు తాను విషం సేవించానని పోలీసులకు సమాచారం అందించాడు. దీని తరువాత, అతన్ని చికిత్స కోసం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యల వెనుక గల ఉద్దేశ్యాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సామూహిక హత్యపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించారు.

Next Story