దారుణం.. నిద్రలో ఉండగా పెట్రోల్‌ పోసి నిప్పంటించిన తండ్రి

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకు, అతని భార్య, మనవడు అని చూడకుండా వారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

By అంజి  Published on  15 Sept 2023 9:26 AM IST
Kerala man, Crime news, Thrissur

దారుణం.. నిద్రలో ఉండగా పెట్రోల్‌ పోసి నిప్పటించిన తండ్రి

ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకు, అతని భార్య, మనవడు అని చూడకుండా వారిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో జరిగింది. సెప్టెంబర్‌ 13వ తేదీ నాడు.. వాగ్వాదం కారణంగా ఓ వ్యక్తి తన కొడుకు, కోడలు, మనవడికి నిప్పంటించాడు. నిందితుడు కొట్టెకత్తిల్ జాన్సన్ బుధవారం రాత్రి తన కుమారుడు జోజి (38), జోజి భార్య లిజి (33), వారి 12 ఏళ్ల కుమారుడు టెండూల్కర్ నిద్రిస్తున్న గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. జాన్సన్ తల్లి సహాయం కోసం కేకలు వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

గాయపడిన కుటుంబ సభ్యులను కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారందరినీ వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. జోజీ, అతని కుమారుడు మరణించగా, లిజీ 70% కంటే ఎక్కువ కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ప్రయత్నంలో జాన్సన్‌కు కూడా కొన్ని గాయాలయ్యాయి, ఆ తర్వాత విషం తాగినట్లు ఆరోపణలు వచ్చాయి. అతడిని త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నివేదికల ప్రకారం.. జాన్సన్ తన కొడుకు జోజీతో జరిగిన వాదనతో ఆవేశానికి లోనయ్యాడు. మన్నుతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story