దారుణం.. భార్యను హత్య చేసి, ఇంట్లో పాతిపెట్టాడు
Kerala man murders wife, buries her at home in Ernakulam. దాదాపు ఏడాదిన్నర క్రితం తన భార్యను చంపి తన ఇంటి ఆవరణలో
By అంజి
దాదాపు ఏడాదిన్నర క్రితం తన భార్యను చంపి తన ఇంటి ఆవరణలో పాతిపెట్టినందుకు కేరళ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు సజీవ్‌ను ఎర్నాకులంలోని అతని ఇంట్లో జరక్కల్ పోలీసులు అరెస్టు చేశారు. సజీవ్ భార్య రమ్య ఆగస్ట్ 2021లో కనిపించకుండా పోయింది. అతను ఫిబ్రవరి 2022లో జరక్కల్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక పోలీసు బృందం నిర్వహించిన శాస్త్రీయ విచారణ తర్వాత తాజాగా అతన్ని అరెస్టు చేశారు. అతను ఏమీ తెలియనట్లు నటిస్తున్నప్పుడు పోలీసు బృందం అతనిని నిశితంగా పరిశీలించింది. అతడిపై ఏడాదిపాటు నిఘా ఉంచి విచారణ జరిపేందుకు తగిన సాక్ష్యాలను సేకరించిన అనంతరం అరెస్టు చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాధితురాలు రమ్య తన భర్త సజీవ్‌తో తరచూ గొడవపడేది. ఈ క్రమంలోనే రమ్య తన భర్త చేతిలో దారుణంగా హత్య చేయబడింది. ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గరే పాతిపెట్టి ఏడాదిన్నర పాటు భర్త ఇంట్లోనే ఉన్నాడు. తన భార్య వేరొకరితో వెళ్లిపోయిందని బంధువులు, స్థానికులకు చెప్పడంతో నిందితుడు తదుపరి పెళ్లికి సిద్ధమయ్యాడు. పోలీసులు జరిపిన విచారణలో.. ఇంటి సిట్టింగ్ ప్రాంతానికి సమీపంలో మహిళ మృతదేహం అవశేషాలు కనుగొనబడ్డాయి. ఇది ఇతర ఆధారాల ఆధారంగా రమ్య అవశేషాలుగా పోలీసులు గుర్తించారు. సజీవ్‌ను హత్యా నేరం చేసి సాక్ష్యాలను నాశనం చేసినందుకు అరెస్టు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోంది.