పొరపాటున బ్యాటరీ వాటర్‌లో.. మద్యం కలుపుకుని తాగి వ్యక్తి మృతి
ఓ వ్యక్తి పొరపాటున మంచి నీళ్లు అనుకుని బ్యాటరీ వాటర్‌లో మద్యం కలుపుకుని తాగి మృతి చెందాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
By అంజి Published on 10 Sept 2023 4:58 PM ISTపొరపాటున బ్యాటరీ వాటర్‌లో.. మద్యం కలుపుకుని తాగి వ్యక్తి మృతి
ఓ వ్యక్తి పొరపాటున మంచి నీళ్లు అనుకుని బ్యాటరీ వాటర్‌లో మద్యం కలుపుకుని తాగి మృతి చెందాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండే ఇన్వర్టర్ బ్యాటరీ నీటిలో మద్యాన్ని కలుపుకుని పొరపాటున సేవించి సెప్టెంబర్ 9, శనివారం నాడు కేరళలోని ఇడుక్కిలో భవన నిర్మాణ కార్మికుడు మరణించాడు. మృతుడు ఇడుక్కిలోని అరక్కుళానికి చెందిన ఎంఎన్ మోహనన్ (62)గా గుర్తించారు. కాంట్రాక్టు పనుల్లో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన తోప్రంకుడిలో నిర్మాణ ప్రాంతానికి వచ్చిన మోహనన్‌కు శుక్రవారం మధ్యాహ్నం విపరీతమైన కడుపునొప్పి రావడంతో తొడుపుజలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో మోహనన్ ప్రమాదవశాత్తూ తన వర్క్‌సైట్‌లోని బ్యాటరీ నీటిని తన మద్యంలో కలిపినట్లు వైద్యుడికి తెలియజేశాడు.
వెంటనే అతన్ని నిపుణుల చికిత్స కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. నివేదికల ప్రకారం.. మోహనన్ పనిచేసిన భవనంలోని ఇన్వర్టర్ రూమ్‌లో తాగునీరు, ఆమ్ల బ్యాటరీ నీరు రెండింటి బాటిళ్లను ఉంచారు. ఇది గందరగోళానికి దారితీసింది. మోహనన్ వెంటనే తన తప్పును గ్రహించి, మద్యంను బయటకు తీసేందుకు ప్రయత్నించాడని, కానీ ఫలించలేదని అతని సహోద్యోగులు పోలీసులకు తెలిపారు. కల్తీ మద్యం వల్ల మోహనన్ రక్తపోటు గణనీయంగా పడిపోయిందని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మురిక్కస్సేరి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. బ్యాటరీ నీటి నమూనాను పరీక్ష కోసం తిరువనంతపురంలోని ప్రభుత్వ ల్యాబ్‌కు పంపారు. కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మోహనన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.