దారుణం.. భార్య, కూతురిని చంపిన తండ్రి.. కొడుకును చంపబోయి..

కేరళలోని కొల్లం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి ముందు తన భార్య, కుమార్తెను గొంతు కోసి చంపాడు.

By అంజి  Published on  7 May 2024 3:38 PM IST
Kerala, suicide, Crime news

దారుణం.. భార్య, కూతురిని చంపిన తండ్రి.. కొడుకును చంపబోయి..

కేరళలోని కొల్లం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి ముందు తన భార్య, కుమార్తెను గొంతు కోసి చంపాడు. నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పూతక్కుళానికి చెందిన శ్రీజు గొంతు కోసే ముందు వారికి విషం ఇచ్చి ఉంటాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య ప్రీత (39), శ్రీనంద (12) మంగళవారం ఉదయం వారి ఇంట్లో శవమై కనిపించారు. శ్రీజూ తన పెద్ద కొడుకు శ్రీరాగ్ (17)ని చంపడానికి ప్రయత్నించాడు.

విఫలం అయిన తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని పరవూరు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులే హత్య చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శ్రీజు తాపీ మేస్త్రీ. "వ్యక్తి, అతని కొడుకు ఇద్దరూ చికిత్సలో ఉన్నారు. కొడుకును సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. వ్యక్తిని తిరువనంతపురం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు" అని అతను చెప్పాడు.

Next Story