ఆ కారణంతో.. మెటల్ ల్యాంప్​తో భార్యను కొట్టి చంపిన భర్త

Kerala man arrested for killing wife on suspicion. కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు.

By అంజి  Published on  6 Sept 2022 5:11 PM IST
ఆ కారణంతో.. మెటల్ ల్యాంప్​తో భార్యను కొట్టి చంపిన భర్త

కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. మెటల్​ ల్యాంప్​తో భార్య తలను పగులగొట్టాడు. దీంతో కిడంగంపరంబుకు చెందిన భార్య నిఖిత (25) మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అంతలోనే ఆవేశానికి లోనైన భర్త అనీష్ మెటల్‌ ల్యాంప్‌తో నిఖిత తలపై కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

బంధువులు ఆమెను వర్కాల తాలూకా ఆసుపత్రికి తరలించగా, నిఖిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ జంట జూలై 8న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవల అనీష్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అనీష్‌ తన భార్య నిఖితతో కలిసి 10 రోజుల క్రితం కాళ్లనొప్పి చికిత్స కోసం కేరళకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే అనీష్‌ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం అనీష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడిని అరెస్టు చేసి అతనిపై హత్య (ఐపిసి సెక్షన్ 302) కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story