కేరళలోని మలప్పురంలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడు ప్రేమ అనే వలపు వల విసిరి యువతిని నమ్మించి మోసం చేశాడు. ప్రేమిస్తున్నట్టు నటించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారు. మారద్‌లోని అరకినార్‌లోని అలప్పట్ ఇంటికి చెందిన శబరినాథ్ (24)ను మెడికల్ కాలేజీ పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సు ఉద్యోగి అయిన నిందితుడు, మలప్పురం స్థానికురాలైన యువతితో ప్రేమలో ఉన్నట్టు నటించి, ఏప్రిల్ 3న ఆమెను మెడికల్ కాలేజీ సమీపంలో ఒక భవనంలోని గదికి తీసుకువచ్చి, బలవంతంగా అత్యాచారం చేశాడు.
ఆపై తన మొబైల్ ఫోన్‌లో ఆ యువతి నగ్న వీడియోను రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తానని బెదిరించి, ఆ యువతిని మెడికల్ కాలేజీ సమీపంలో ఒక భవనంలోని ఒక గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా మెడికల్ కాలేజీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వజ్హయూర్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్ పోలీసులు కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.