విషాదం.. రిసార్ట్‌లో కూతురిని చంపి దంపతుల ఆత్మహత్య

కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొడగు జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కేరళకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ గదిలో శవమై కనిపించారు.

By అంజి
Published on : 11 Dec 2023 1:30 PM IST

Kerala couple, Karnataka resort, Crime news

విషాదం.. రిసార్ట్‌లో కూతురిని చంపి దంపతుల ఆత్మహత్య

కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొడగు జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కేరళకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ గదిలో శవమై కనిపించారు. దంపతులు తమ 11 ఏళ్ల కుమార్తెను చంపి, ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఆదివారం, డిసెంబర్ 10 తెలిపారు. మృతులు కేరళలోని కొట్టాయంకు చెందిన వినోద్ (43), జుబీ అబ్రహం (37), వారి కుమార్తె జోహాన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబసభ్యులు శనివారం రిసార్ట్‌లోకి వెళ్లగా అదే రోజు సాయంత్రం వీరంతా శవమై కనిపించారు.

సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ప్రకారం, కేరళలోని కొల్లంకు చెందిన బాధితులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర చర్య తీసుకోవలసి వచ్చిందని చెప్పారు. రిసార్ట్ సిబ్బంది కాల్ అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వినోద్, జాబీ తమ గదిలో ఉరివేసుకుని ఉండగా, వారి కుమార్తె మంచంపై విగతజీవిగా పడి ఉంది. "ఆత్మహత్య నోట్‌లో దంపతులు ఆర్థిక ఒత్తిడి, కేరళలో నమోదైన ఆర్థిక నేరాల కేసును పేర్కొన్నారు" అని పోలీసు అధికారి కె రామరాజన్ చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగింది.

Next Story