దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ పోసిన ప్రధానోపాధ్యాయుడు
మరుగుదొడ్డి శుభ్రం చేసేందుకు ఉంచిన యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినందుకు గాను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని శుక్రవారం సస్పెండ్ చేశారు.
By అంజి Published on 27 Oct 2023 8:28 AM GMTదారుణం.. విద్యార్థినిపై యాసిడ్ పోసిన ప్రధానోపాధ్యాయుడు
మరుగుదొడ్డి శుభ్రం చేసేందుకు ఉంచిన యాసిడ్‌ను విద్యార్థినిపై పోసినందుకు గాను ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని శుక్రవారం సస్పెండ్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా జోడిచిక్కెనహళ్లిలోని ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ స్కూల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న రంగస్వామి సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయుడు. ఈ మేరకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ) రవిశంకరరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగస్వామి, విద్యార్థిపై మరుగుదొడ్లు కడిగేందుకు ఉపయోగించే యాసిడ్‌ను పోసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు ప్రధానోపాధ్యాయుడిపై బాధితురాలి తల్లిదండ్రులు చిత్రదుర్గ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అక్టోబరు 25న దసరా సెలవుల అనంతరం విద్యార్థులు పాఠశాలకు తిరిగి రాగా, ప్రధానోపాధ్యాయుడు మరుగుదొడ్లు శుభ్రం చేయాలని కోరారు. అయితే అందులో ఒక టాయిలెట్ సరిగా శుభ్రం చేయకపోవడంతో కోపోద్రిక్తుడైన రంగస్వామి స్వయంగా శుభ్రం చేయడం ప్రారంభించి నేలపై యాసిడ్ చల్లాడు. ఈ సమయంలో అక్కడే నిలబడి ఉన్న విద్యార్థినిపై యాసిడ్ పడింది. బాలికకు వీపుపై బలమైన కాలిన గాయాలు ఉండడంతో ప్రధానోపాధ్యాయుడు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీనియర్లు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుండగా, సించన అక్కడికి వచ్చిందని, ఆమెను వెనక్కి వెళ్లమని అడిగారని అతను చెప్పాడు. ఇంతలో పొరపాటున జేబులో పెట్టుకున్న పౌడర్ ఆమెపై పడింది. ఈ చర్య ఉద్దేశపూర్వకంగా చేయలేదని నిందితుడు తెలిపాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సించన తల్లి హెడ్ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.