భార్య ప్రియుడి గొంతు కోసి.. రక్తాన్ని తాగిన వ్యక్తి
కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతు కోసి అతని రక్తం తాగాడు. అంతే కాదు ఆ ఘటనను
By అంజి Published on 26 Jun 2023 8:03 AM GMTభార్య ప్రియుడి గొంతు కోసి.. రక్తాన్ని తాగిన వ్యక్తి
కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. చిక్కబళ్లాపూర్‌లో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతు కోసి అతని రక్తం తాగాడు. అంతే కాదు ఆ ఘటనను వీడియో తీయమని తన స్నేహితుడిని కూడా కోరాడు. దీంతో సంఘటనను నిందితుడి స్నేహితుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. చింతామణి జిల్లాకు చెందిన విజయ్ కూరగాయలు, బట్టల వ్యాపారం చేసేవాడు. ఇందుకోసం మారేష్ అనే వ్యక్తికి చెందిన వాహనాన్ని అద్దెకు తీసుకుని సరుకులు రవాణా చేసేవాడు.
ఆ తర్వాత విజయ్ ఇంటికి రావడం ప్రారంభించిన మారేష్ నిందితుడి భార్యతో పరిచయం పెంచుకున్నాడు. కొంతకాలం క్రితం విజయ్ తన భార్య, మారేష్ ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకునేవారని తెలుసుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విజయ్.. మారేష్‌ను తన భార్యకు దూరంగా ఉండమని హెచ్చరించాడు. అయినప్పటికీ, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కొనసాగించారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ్ జూన్ 19న సరుకులు రవాణా చేయాలంటూ మారేష్‌ను నిర్జన ప్రాంతానికి పిలిపించి.. జాన్ అనే బంధువును కూడా తీసుకెళ్లాడు. విజయ్, మారేష్‌ల మధ్య వాగ్వాదం జరగడంతో విజయ్ తన వద్ద ఉంచుకున్న కత్తితో మహేష్‌ను గొంతు కోసి గాయపరిచాడని పోలీసులు తెలిపారు.
మారేష్ గొంతు కోసిన తర్వాత విజయ్ ఊహించని పని చేశాడు. నిందితుడు.. మారేష్ రక్తం తాగాడు. తన మొబైల్‌లో రికార్డ్ చేయమని జాన్‌ని కోరాడు. అప్పటికి చాలా భయపడిన జాన్ మారేష్‌ని అక్కడే వదిలేసి పారిపోయాడు. మహేష్‌పై చిన్న కత్తితో దాడి చేయడంతో, అతని ప్రాణం రక్షించబడింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మారేష్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయనప్పటికీ, ఈ సంఘటన గురించి పోలీసులకు వెంటనే సమాచారం రాలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో. దీంతో పోలీసులు మహేశ్‌ను ఆరా తీసి అతడి ఫిర్యాదు మేరకు నిందితుడు విజయ్‌ని అరెస్టు చేశారు.