'భార్య నిత్యం కొడుతోంది.. కాపాడండి'.. ప్రధాని మోదీకి భర్త ఫిర్యాదు

Karnataka man says wife beats him, complains to PM's office. చాలా మంది భార్యలు తమ భర్తలు కొడుతున్నారంటూ పోలీస్‌స్టేషన్లకు వెళ్లడం మనం చూసూంటాం. అయితే

By అంజి  Published on  2 Nov 2022 6:48 AM GMT
భార్య నిత్యం కొడుతోంది.. కాపాడండి.. ప్రధాని మోదీకి భర్త ఫిర్యాదు

చాలా మంది భార్యలు తమ భర్తలు కొడుతున్నారంటూ పోలీస్‌స్టేషన్లకు వెళ్లడం మనం చూసూంటాం. అయితే ఇక్కడ మాత్రం రివర్స్‌ జరిగింది. ఓ వ్యక్తి తనను నిత్యం కొడుతున్న తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని (పీఎంవో) కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. తన భార్య నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆ వ్యక్తి ఆరోపించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బెంగుళూరుకు చెందిన యదునందన్ ఆచార్య.. సోషల్ మీడియా ద్వారా పీఎంఓకు తన ఫిర్యాదులను పంపారు. అతను తన ట్వీట్‌ను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు హ్యాండిల్స్‌కు ట్యాగ్ చేశాడు.

"నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదా ఇది జరిగినప్పుడు ఎవరైనా సహాయం చేశారా?.. చేయను, నేను మగవాడిని కాబట్టి!. నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు పెంచిన నారీ శక్తి ఇదేనా? దీని కోసం నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదా!'' అంటూ ట్వీట్‌ చేశాడు. తన భార్య కత్తితో దాడి చేయడంతో తన చేతి నుండి రక్తం కారుతున్నట్లు కూడా పేర్కొన్నాడు. అతని ట్వీట్‌పై బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి స్పందిస్తూ.. పోలీస్ స్టేషన్‌ను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతని ఫిర్యాదును పరిష్కరించాలని కోరారు. యదునందన్ ఆచార్యకు సోషల్‌ మీడియాలో ఈ విషయమై సపోర్ట్‌ లభించింది. వేధింపులకు గురైన భర్తల సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.


Next Story