Karimnagar: హత్యకు గురైన కాలేజీ విద్యార్థి తల లభ్యం

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిమ్మాపూర్ శివార్లలోని వ్యవసాయ బహిరంగ బావిలో.. తప్పిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ తల లభ్యమైంది.

By అంజి  Published on  3 April 2024 7:42 AM IST
Karimnagar , Student , Crime news

Karimnagar: హత్యకు గురైన కాలేజీ విద్యార్థి తల లభ్యం

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిమ్మాపూర్ శివార్లలోని వ్యవసాయ బహిరంగ బావిలో.. తప్పిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి అభిలాష్ తల లభ్యమైంది. విద్యార్థి తలను పోలీసులు మంగళవారం వెలికితీశారు. మార్చి 27న తల లేకుండా విద్యార్థి మొండెంతో మృతదేహం లభ్యమైంది. తల కోసం గాలించిన పోలీసులు.. ఓ బావిలో మంగళవారం గుర్తించారు. విద్యార్థి తన కళాశాలలో నెల రోజుల క్రితం మార్చి 1వ తేదీన కనిపించకుండా పోయాడు. కాగా, విద్యార్థులకు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా బాధితుడి తల్లిదండ్రులతో పాటు పలు విద్యార్థి, బీసీ సంఘాలు ధర్నాకు దిగాయి.

కళాశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ బాధ్యతారాహిత్యం వల్లే విద్యార్థి అదృశ్యమై వ్యవసాయ బావిలో శవమై కనిపించాడని వారు ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా చొరవ తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. మంగళవారం పోలీసులు క్రేన్లు, మోటారు పంపుసెట్లతో ఓపెన్ బావిలో నీటిని బయటకు తీసి అభిలాష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల విద్యార్థిదేనా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. తలను పోస్టుమార్టం నిమిత్తం పంపిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఓ నిర్ధారణకు రావచ్చని చెప్పారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story