భర్తను హత్య చేసిన భార్య.. క్రైం సీరియల్ చూసి అందులో ఉన్నట్లుగానే..!
Kanpur woman kills hubby with drug overdose.స్తి కోసం కట్టుకున్న వాడిని ప్రియుడి సాయంతో హతమార్చిందో భార్య
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2022 12:11 PM ISTఇటీవల కాలంలో మానవసంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఆస్తి కోసం కట్టుకున్న వాడిని ప్రియుడి సాయంతో హతమార్చిందో భార్య. ఓ క్రైమ్ సీరియల్ చూసి అందులో ఉన్న విధంగానే భర్తను కడతేర్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది.
రిషబ్, స్వప్న దంపతులు. వీరు కాన్పూరులోని కల్యాణ్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. గత 27న వీరు ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా గుర్తు తెలియని కొందరు దుండుగు రిషబ్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రిషబ్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 1 డిశ్చార్జ్ అయ్యాడు.
ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన రెండు రోజులకే అంటే డిసెంబర్ 3న మళ్లీ అతడి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. రిషబ్ మృతి స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధిక మోతాదులో ఔషదాలు తీసుకోవడం వల్లే రిషబ్ మరణించాడని పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. అధికంగా ఔషదాలు తీసుకోవడం వల్ల అతడి అవయవాలు దెబ్బతిని చనిపోయాడని తేలింది.
పోలీసులకు అతడి భార్య స్పప్నపైనే అనుమానం వచ్చింది. ఫోన్‌కాల్స్, వాట్సప్ చాటింగ్‌లను పరిశీలించగా అసలు నిజం తెలిసింది. స్వప్నను అదుపులోకి తీసుకోని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించింది. భర్తను కొట్టి చంపించాలని ప్రయత్నించగా చికిత్స పొంది బతికాడని, అనంతరం అధిక మోతాదులో మందులు ఇచ్చి చంపినట్లు చెప్పింది. భర్త పేరు మీదు చాలా ఆస్తులు ఉన్నాయని, అయితే.. అవి తన పేరు మీద రాస్తాడో లేదో అన్న అనుమానంతో తన ప్రియుడు రాజుతో కలిసి హత్య చేసినట్లు తెలిపింది. ఓ క్రైం సీరియల్ చూసి ఇలా అధిక మొత్తంలో ఔషదాలు ఇవ్వాలన్న ఆలోచన తనకు వచ్చినట్లు చెప్పింది.