కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. ప్రైవేట్‌ ఫొటోలు లీక్‌ చేస్తానని బెదిరించి..

Kabbadi Player Accuses Coach Of Raping, Blackmailing Her. అంతర్జాతీయ ఈవెంట్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన కబడ్డీ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు

By అంజి  Published on  7 Feb 2023 11:33 AM IST
కబడ్డీ క్రీడాకారిణిపై కోచ్ అత్యాచారం.. ప్రైవేట్‌ ఫొటోలు లీక్‌ చేస్తానని బెదిరించి..

అంతర్జాతీయ ఈవెంట్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన కబడ్డీ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు చేసింది. తనపై కోచ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని 27 ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వ్యక్తిగత చిత్రాలను సోషల్‌ మీడియాలో లీక్‌ చేస్తానని బెదిరించి కోచ్‌ తనపై అత్యాచారం చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని క్రీడాకారిణి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు గత వారం ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తన కోచ్‌పై ఫిర్యాదు చేసి, సోమవారం ఈ కేసులో విచారణలో చేరినట్లు వారు తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 164 (మేజిస్ట్రేట్ ఒప్పుకోలు లేదా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడం) కింద ఆమె వాంగ్మూలాన్ని కోర్టు ముందు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

''2012లో ఢిల్లీలోని ముండ్కా సమీపంలోని హిరంకుడ్నాలో కబడ్డీ పోటీకి సిద్ధమవుతున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 2015లో ఆమె అనుమతి లేకుండా కోచ్ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు'' అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆమెను కోచ్‌ క్రిమినల్ బెదిరింపులకు గురిచేశాడని చెప్పారు. 2018లో గెలుపొందిన మొత్తంలో కొంత భాగాన్ని (పోటీ నుండి) అతనికి ఇవ్వాలని నిందితుడు బలవంతం చేశాడని, ఆ తర్వాత కోచ్ జోగిందర్‌ బ్యాంక్ ఖాతాలో రూ.43.5 లక్షలు బదిలీ చేశానని ఆమె చెప్పిందని అధికారి తెలిపారు.

2021లో తనకు పెళ్లయిందని, ఇప్పుడు నిందితుడు తన ప్రైవేట్ ఫొటోలను లీక్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) ఎం హర్షవర్ధన్ తెలిపారు. "ఈ రోజు ఆమె విచారణలో చేరింది. CrPC సెక్షన్ 164 కింద కోర్టులో ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేయబడింది. పరారీలో ఉన్న కోచ్‌ని పట్టుకోవడానికి మేము బృందాలను ఏర్పాటు చేసాము" అని పోలీసు అధికారి తెలిపాడు.

Next Story