కబడ్డీ క్లబ్ అధ్య‌క్షుడి దారుణ హత్య

Kabaddi club president shot dead outside Punjabi University.పాటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో రెండు వర్గాల

By M.S.R  Published on  7 April 2022 6:30 PM IST
కబడ్డీ క్లబ్ అధ్య‌క్షుడి దారుణ హత్య

పాటియాలాలోని పంజాబీ యూనివర్శిటీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మంగళవారం రాత్రి క్యాంపస్ బయట ఉన్న డాబా వద్ద ఒక వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. మరణించిన వ్యక్తిని ధర్మిందర్ సింగ్ అని గుర్తించారు. అతను జిమ్ కు తరచుగా వెళుతూ ఉంటాడు, దౌన్ కలాన్ గ్రామంలోని కబడ్డీ క్లబ్‌కు అధ్యక్షుడు. అతను రాజకీయంగా కూడా చురుకుగా ఉన్నాడు. క్యాంపస్ వెలుపల ఉన్న డాబాలో ప్రత్యర్థి బృందంతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన గ్రామస్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అతను కాల్చి చంపబడ్డాడు.

ఇప్పటి వరకు నలుగురిపై కేసు నమోదైంది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద హర్వీర్ సింగ్, తేజిందర్ సింగ్, డౌన్ కలాన్‌కు చెందిన ఇద్దరు పేరులేని అనుమానితులపై కేసు నమోదు చేయబడింది. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే సింగ్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. "ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నాం. చనిపోయిన వ్యక్తి, నిందితులు ఇద్దరూ పాటియాలా జిల్లాలోని దౌన్ కలాన్ గ్రామ నివాసితులు, "అని పాటియాలా పోలీసు సూపరింటెండెంట్ హర్పాల్ సింగ్ తెలిపారు.

మృతుడి సోదరుడు మాట్లాడుతూ, "నా సోదరుడు కబడ్డీ ఆటగాడు. కబడ్డీ మ్యాచ్‌లను కూడా నిర్వహించేవాడు." అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు ఈ ఏడాది మార్చి 14న జలంధర్‌లో అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్ నంగల్ అంబియాపై కాల్పులు జరిగాయి.

Next Story