పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..

Junior artist allegedly gets cheated and raped approaches SR Nagar police. హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అత్యాచారం చేశాడని

By అంజి  Published on  18 Feb 2023 1:27 PM IST
పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచారం.. గర్భం దాల్చడంతో..

హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు నెలల గర్భిణి అయిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ బోరబండలో ఉంటోంది. రెండేళ్ల క్రితం గుంటూరు జిల్లా కాకానికి చెందిన నిందితుడు రోహిత్ ఖాన్ (26)తో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారు దగ్గరయ్యారు. అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది. వారు అనేక సందర్భాలలో కలుసుకున్నారు.

ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి విషయాన్ని లేవనెత్తినప్పుడు రోహిత్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఆపై బెదిరించడంతో పాటు ఆమె నుండి తప్పుకోవడం ప్రారంభించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపు, చీటింగ్ తదితర నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story