జర్నలిస్ట్ ఇంటికి నిప్పటించిన దుండగులు.. ఇద్దరు సజీవదహనం
Journalist burnt to death in UP.. ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టు
By సుభాష్ Published on
30 Nov 2020 4:33 AM GMT

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టు ఇంటికి నిప్పటించారు. ఈ ఘటనలో జర్నలిస్టును దహనం చేశారు. యూపీలోని బలరాంపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. బలరాంపూర్‌లోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్‌తో కలిసి ఉంటున్నాడు. అయితే ఇదే అదనుగా భావించి గుర్తు తెలియని దుండగులు ఇంటికి నిప్పటించారు. ఈ ఘటనలో జర్నలిస్టు రాకేష్ సింగ్ తోపాటు అతని స్నేహితుడు సజీవదహనం అయ్యారు. అయితే ఈ ఘటన సమయంలో జర్నలిస్టు భార్య, పిల్లలు ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ప్రాణాలు దక్కాయి.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరణించిన జర్నలిస్టు కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును జిల్లా అధికారులు మృతుడి భార్యకు అందించారు. అలాగే బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు.
Next Story