నటి రియా కుమారి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన దుండగులు

Jharkhand actress shot dead on Bengal highway. జార్ఖండ్‌కు చెందిన నటి రియా కుమారి దారుణ హత్యకు గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని హైవేపై బుధవారం

By అంజి  Published on  28 Dec 2022 3:45 PM IST
నటి రియా కుమారి దారుణ హత్య.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన దుండగులు

జార్ఖండ్‌కు చెందిన నటి రియా కుమారి దారుణ హత్యకు గురైంది. పశ్చిమ బెంగాల్‌లోని హైవేపై బుధవారం పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆమెను కాల్చి చంపారు. తాను జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాతనని చెప్పుకున్న ఆమె భర్త ప్రకాష్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నటి రియా తన భర్తతో రాంచీ నుండి కోల్‌కతాకు వెళుతుండగా ఉదయం 6 గంటలకు ఈ సంఘటన జరిగింది. ప్రకాష్ కుమార్ వాహనం నడుపుతుండగా, వారితోపాటు దంపతుల మూడేళ్ల కూతురు కూడా ఉంది.

అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. హౌరా జిల్లాలోని ఉలుబెరియా సబ్ డివిజన్ పరిధిలోని బగ్నాన్ వద్ద ఉన్న మహిశ్రేఖ వంతెన సమీపంలో టాయిలెట్‌ వెళ్లేందుకు వాహనాన్ని ఆపాడు. అనంతరం డబ్బు, ఇతర విలువైన వస్తువులను దోచుకోవాలనే ఉద్దేశంతో ముగ్గురు దుండగులు మారణాయుధాలతో వారి వద్దకు వచ్చారు. నటి రియా, ఆమె భర్త ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పుడు, దుండగులలో ఒకరు పాయింట్-బ్లాంక్ నుండి రియాపై కాల్పులు జరిపారు. ఆమె వెంటనే తీవ్ర రక్తస్రావంతో కింద పడిపోయింది.

ఆ తర్వాత దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఆ వెంటనే ప్రకాష్‌ కుమార్‌ సమీపంలోని ప్రాంతానికి వెళ్లి జరిగిన విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రియాను ఉలుబేరియా సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికి ఆమె మృతి చెందింది. పోలీసులు విచారణ ప్రారంభించి మరిన్ని వివరాల కోసం ప్రకాష్ కుమార్‌ను ప్రశ్నిస్తున్నారు.

Next Story