గంగానదిలోకి దూసుకెళ్లిన జీపు.. 10 మంది గల్లంతు
Jeep fell into Ganga river in Bihar.బీహార్ రాష్ట్రంలో గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on
23 April 2021 7:45 AM GMT

బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలోకి జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు. పాట్నా జిల్లా పీపాపుల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో జీపులో 15 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 5 మంది క్షేమంగా బయటపడగా.. మరో 10 మంది నదిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు దళాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా.. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story