ఈ మధ్యన పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫేజ్‌-4లోని హైటెక్‌ అలుకాస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెలవు దినం కావడంతో కార్మికులెవ్వరు విధుల్లో లేకపోవడం పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. ఈ పరిశ్రమలో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరుగగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సుభాష్

.

Next Story