విషాదం.. ఇంటికి వ‌స్తూ జ‌వాను మృతి.. భార్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Jawan Died in Train accident wife attempts suicide.ఓ జవాన్ సెల‌వుపై స్వ‌గ్రామానికి వ‌స్తుండ‌గా.. ప్ర‌మాదవ‌శాత్తు రైలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Oct 2021 8:04 AM IST
విషాదం.. ఇంటికి వ‌స్తూ జ‌వాను మృతి.. భార్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

ఓ జవాన్ సెల‌వుపై స్వ‌గ్రామానికి వ‌స్తుండ‌గా.. ప్ర‌మాదవ‌శాత్తు రైలు కింద ప‌డి మృతి చెందాడు. భ‌ర్త మ‌ర‌ణించిన విషయం తెలిసిన గ‌ర్భిణి అయిన భార్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ విషాద ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా నంద‌వ‌రం మండ‌లంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. క‌న‌వీడుపేట‌కు చెందిన కురువ మనోహర్ ఆర్మీలో ప‌నిచేస్తున్నాడు. అత‌డికి నంద‌వ‌రం మండ‌లం గుర‌జాల గ్రామానికి చెందిన ర‌మాదేవితో మూడేళ్ల క్రితం వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ర‌మాదేవి నిండు గ‌ర్బిణీ. కాగా.. మ‌నోహ‌ర్ సెల‌వుపై స్వ‌గ్రామానికి బ‌య‌లుదేరాడు. శుక్ర‌వారం రాత్రి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఓ స్టేష‌న్‌లో రైలు దిగి.. తిరిగి ఎక్కే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలు జారి కింద‌ప‌డి మృతి చెందాడు. భ‌ర్త రాక కోసం వెయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న ర‌మాదేవి.. మ‌నోహ‌ర్ మృతిని జీర్ణించుకోలేక పోయింది. పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. మనోహర్ మ‌ర‌ణించ‌డం, రమాదేవి ఆత్మహత్య యత్నం చేయడంతో కనకవీడుపేటలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story