jangaon: సెల్ఫీ వీడియో తీసి.. భార్యభర్తల ఆత్మాహత్యాయత్నం
జనగామ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. సెల్పీ వీడియో తీసుకుని.. భార్య భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.
By అంజి Published on 13 Aug 2023 11:45 AM ISTjangaon: సెల్ఫీ వీడియో తీసి.. భార్యభర్తల ఆత్మాహత్యాయత్నం
జనగామ జిల్లాలో విషాద సంఘటన జరిగింది. సెల్పీ వీడియో తీసుకుని.. భార్య భర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నర్మెట్ట మండలంలోని సూర్యబండతండా గ్రామానికి చెందిన భూక్య గురు - సునీత భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదనే మనస్తాపంతో భార్య భర్తలు పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.
భూమి కబ్జా చేసిన వారి పేర్లను సెల్ఫీ వీడియోలో బాధితులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాభర్తల సెల్ఫీ సూసైడ్ సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ భార్యాభర్తల కన్నీటి పర్యంతం అయ్యారు. తన భార్య పేరు మీద భూమి ఉందని, తాము చనిపోయితున్నాం అంటూ తమ పిల్లల పేరు మీదైనా భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ వీడియోలో కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, స్థానికులంతా ఒక్కటయ్యారని, తమను చంపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.