Nagpur: వర్క్‌ విషయంలో గొడవ.. ఐటీ ఉద్యోగిని చంపిన జూనియర్ సహోద్యోగి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఉద్యోగిని జూనియర్‌ సహోద్యోగి హత్య చేశాడు.

By అంజి  Published on  26 Feb 2024 7:01 AM IST
Nagpur, IT consultant, work dispute, Crime news

Nagpur: వర్క్‌ విషయంలో గొడవ.. ఐటీ ఉద్యోగిని చంపిన జూనియర్ సహోద్యోగి

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఉద్యోగిని జూనియర్‌ సహోద్యోగి హత్య చేశాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియర్ సహోద్యోగి, పనిలో తన పనితీరు గురించి సీనియర్ వ్యాఖ్యానించినందుకు కోపంగా ఉన్నాడని, ఈ క్రమంలోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని పోలీసులకు చెప్పాడని, ఫిబ్రవరి 25, ఆదివారం ఒక అధికారి తెలిపారు.

ఎల్ దేవనాథన్ లక్ష్మీనరసింహన్ (21) అనే బాధితుడు గత పది నెలలుగా మిహాన్ (మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ ఎయిర్‌పోర్ట్)లో హెక్సావేర్ టెక్నాలజీస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని నాగ్‌పూర్ పోలీసులు తెలిపారు. శ్యామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో బాధితుడు, అతని సహచరులు చందేల్, పవన్ అనిల్ గుప్తా అలియాస్ హల్వాయి మద్యం సేవిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చందేల్ యొక్క పనితీరు గురించి దేవనాథన్ ప్రశ్నలు లేవనెత్తాడు. అతను కొన్ని రంగాలలో లోపించాడని చెప్పాడని అధికారి తెలిపారు.

"చాందేల్ కోపంగా ఉన్నాడు. కత్తి పట్టుకుని దేవనాథన్ ఛాతీపై పొడిచాడు. కత్తి దేవనాథన్ గుండెలో గుచ్చుకుంది, ఫలితంగా అతని మరణానికి దారితీసింది”అని అధికారి తెలిపారు. బుధవారం ఉదయం దేవనాథన్‌ను చందేల్‌, హల్వాయి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లడంతో నేరం వెలుగులోకి వచ్చింది. బాత్‌రూమ్‌లో పడిపోవడంతో గాయాలైనట్లు సిబ్బందికి తెలిపారు. అయితే, శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో సిబ్బంది వారి వాదనలపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు విచారించగా చందేల్ నేరం ఒప్పుకున్నాడు

Next Story