రాఖీ సావంత్ భర్తపై ఇరాన్ మహిళ అత్యాచార ఆరోపణలు
Iranian woman has accused Rakhi Sawant's husband of rape. మైసూర్‌లో రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ దురానీపై తాజాగా ఎఫ్ఐఆర్ దాఖలు
By అంజి Published on 12 Feb 2023 7:28 AMమైసూర్‌లో రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ దురానీపై తాజాగా ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. మైసూర్‌లోని వివి పురం పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 376 కింద ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇరాన్ యువతిపై ఆదిల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రాఖీ సావంత్ పెట్టిన మోసం కేసులో ఆదిల్ ఇప్పటికే జైలులో ఉన్నాడు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆదిల్‌పై ఇది రెండో ఎఫ్‌ఐఆర్.
మైసూర్‌లో సహజీవనం చేస్తున్నప్పుడు పెళ్లి సాకుతో ఆదిల్ తనపై అత్యాచారం చేశాడని యువతి తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయగా, అతను దానిని తిరస్కరించాడని చెప్పింది. అతను చాలా మంది అమ్మాయిలతో ఇలాంటి సంబంధం కలిగి ఉన్నాడని ఆమె పేర్కొంది. ఆ తర్వాత ఆమె సన్నిహిత చిత్రాలను పంపి ఎలాంటి ఫిర్యాదు చేయవద్దని బెదిరించి బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పింది. ఇప్పుడు ఐపీసీ సెక్షన్లు 376, 417,420, 504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
అంతకుముందు ఫిబ్రవరిలో, రాఖీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. ఆదిల్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని రాఖీ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు.. ఆదిల్‌ను ఓషివారా పోలీస్ స్టేషన్‌లో విచారణ కోసం పిలిపించి, ఆపై అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే రాఖీ ఆదిల్‌ని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది. కొద్దిరోజుల తర్వాత ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని, ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మరో విషయం ఏమిటంటే, రాఖీ సావంత్ తల్లి జయ జనవరి 28న ముంబైలో మరణించారు. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్‌తో పోరాడిన ఆమె గత కొన్నేళ్లుగా చికిత్స పొందుతూ గత నెల కన్నుమూసింది. రాఖీ చివరిసారిగా బిగ్ బాస్‌లో కనిపించింది. కొన్నాళ్లుగా ఆమె ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతోంది. ఆమె సినిమాలు, టెలివిజన్ రెండింటిలోనూ పనిచేసింది.