Hyderabad: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని మంగళవారం ఉదయం
By అంజి Published on 13 Jun 2023 2:00 PM ISTHyderabad: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బాధితురాలు వంశిక (16) జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపిసి స్ట్రీమ్‌లో ప్రవేశం పొందిందని, వారం రోజుల క్రితమే హాస్టల్‌లో చేరిందని పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కాలేజీ హాస్టల్ భవనంలోని ఐదో అంతస్తులోకి వెళ్లి బాలిక దూకింది.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? లేకా ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. బాలికపై తీవ్ర చర్య తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా ఈ ఘటనతో ఇంటర్ కాలేజీలోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
- ఎవరైనా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మీకు తెలిస్తే, దయచేసి సహాయం అందించండి. వ్యక్తులు, కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించే ఆత్మహత్య-నివారణ సంస్థల యొక్క కొన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి. కాల్- 9152987821, AASRA-9820466726, రోష్ని ట్రస్ట్- 040-66202000.