గదిలో ఎంబీఏ విద్యార్థిని నగ్న మృతదేహం.. అశ్లీల ఫోటోలతో వేధించిన క్లాస్‌మేట్.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. అద్దె గదిలో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని నగ్న స్థితిలో శవమై...
By - అంజి |
గదిలో ఎంబీఏ విద్యార్థిని నగ్న మృతదేహం.. అశ్లీల ఫోటోలతో వేధించిన క్లాస్‌మేట్!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. అద్దె గదిలో 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని నగ్న స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆమె మెడపై తాడు గుర్తులు ఉండటంతో, నిందితులు ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె ప్రియుడు పీయూష్ ధమ్నోడియా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బాధిత యువతి గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. ఫిబ్రవరి 11న తన తండ్రితో కలిసి బర్త్ సర్టిఫికేట్ సవరణ కోసం వెళ్లిన ఆమె, ఆ రాత్రి స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పీయూష్ అనే యువకుడి గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. తన కుమార్తెను ఆమె వేసుకున్న సాక్సుల ఆధారంగా గుర్తించానని తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.
బాధిత యువతి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. పీయూష్ తన కుమార్తెకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తానని బెదిరించేవాడని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తూ, తన కాలేజీ ఫీజులు కూడా ఆమెతోనే కట్టించుకునేవాడని తెలిపారు. ఈ వేధింపుల కారణంగానే తన కుమార్తె తీవ్రమైన కుంగుబాటులోకి (డిప్రెషన్) వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు నిజమైనవా లేక మార్ఫింగ్ చేసినవా అనేది విచారణలో తేలాల్సి ఉంది.
మృతురాలు, నిందితుడు పీయూష్ ఇద్దరూ ఒకే కాలేజీలో ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారు. డిసిపి కృష్ణ లాల్‌చందాని ఈ హత్యను ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని, గొంతు నులమడం వల్లే మరణం సంభవించిందని ప్రాథమికంగా తేలిందని చెప్పారు. మందసౌర్‌కు చెందిన పీయూష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించింది. పోస్ట్‌మార్టం నివేదిక మరియు తదుపరి ఫోరెన్సిక్ విశ్లేషణ తర్వాత సంఘటనల యొక్క ఖచ్చితమైన క్రమం మరియు ఉద్దేశ్యం స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.