ఇండోర్‌లో ఒక మహిళకు వ్యాధి సోకిన రక్తంతో ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. సంజయ్ అనే వ్యక్తి తనను మహిళ తిరస్కరించిందనే కోపంతో ఉన్నాడు. కథానాయకుడికి వైరస్ ఇంజెక్ట్ చేసిన తమిళ చిత్రం 'ఐ' నుంచి తాను స్ఫూర్తి పొందానని సంజయ్ పోలీసులకు తెలిపాడు. సంజయ్‌తో పాటు కిషోర్ అనే మరో వ్యక్తి కూడా మహిళను వెంబడించి, ఇన్ఫెక్షన్కు గురైన రక్తాన్ని ఆమెకు ఎక్కించేందుకు ప్రయత్నించారు. వారు వ్యాధి సోకిన బిచ్చగాడి నుండి రక్తాన్ని సేకరించారు.
సంజయ్, కిషోర్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులు తనను వెంబడించి, ఇన్ఫెక్షన్కు గురైన రక్తాన్ని ఇంజెక్ట్ చేసేందుకు ప్రయత్నించారని, అయితే తాను తప్పించుకుపోయానని మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంజయ్ రిపీట్ అఫెండర్ అని, అతనిపై 11 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. సిరంజిలోని రక్తాన్ని పరిశీలించిన తర్వాత అతడిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.