ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య.. ఇంకో 10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

Indian Air Force employee commits suicide ahead of his marriage in Eluru. భారత వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి పెళ్లికి ఇంకా పదిరోజులు మాత్రమే ఉందన్న

By అంజి  Published on  5 Feb 2023 3:02 PM IST
ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య.. ఇంకో 10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

భారత వాయుసేనకు చెందిన ఓ ఉద్యోగి పెళ్లికి ఇంకా పదిరోజులు మాత్రమే ఉందన్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాలుగో కుమారుడు హరిబాబు(33) ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నాడు. ఇటీవలే అతడి పెళ్లి కుదిరింది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్ బాబు అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నాడు.

ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆ రోజు ఉదయం ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు కొట్టగా హరిబాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. అనంతరం చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. కిందకు చూసే సరికి అప్పటికే మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ టి.సుధీర్‌ తెలిపారు.

Next Story