నాగర్ కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించడానికి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి శనివారం సాయంత్రం వచ్చారు. ఆలయంలో దర్శనం తర్వాత అక్కడే నిద్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్టప్రాంతంలోకి వెళ్లింది. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న యువకులు ఆమెను బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.
అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడి పాల్పడ్డారు. ఆ బంధువు చేతులు కట్టేశారు. యువతి బలవంతంగా సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్టు తెలిసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది యువకులుగా పోలీసులు గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.